శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని కౌలేపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితను నల్లమాడ మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తూ ఉండడంతో స్థానికులు అతడికి సోమవారం దేహశుద్ధి చేశారు. మహిళ విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో వారు అక్కడే పట్టుకొని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని స్టేషన్ కు తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు