పాణ్యం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని వినాయక నిమజ్జనం ఘాట్ ను మండల తహసిల్దార్ నరేంద్ర నాథ్ రెడ్డి, సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి లు శనివారం పరిశీలించారు. వినాయక నిమజ్జనం రోజున చేపట్టవలసిన భద్రత ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ నరేంద్ర నాథ్ రెడ్డి సూచించారు...