కుటుంబ కలహాల వల్లే మా నాన్న పురుగుల మందు తాగాడుయూరియా కోసం కాదు కావాలని కొంతమంది మా నాన్నతో అలా చెప్పించారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో నిన్న యూరియా దొరకలేదని మండల కేంద్రానికి చెందిన మల్లెల నరసయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడని జరుగుతున్న ప్రచారంపై వారి కూతురు స్పందిస్తూ , "మా ఇంట్లో కుటుంబ కలహాల వల్లే మా నాన్న మందు తాగడం జరిగిందని దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ కొంత మంది యూరియా దొరక లేదని పురుగుల మందు తీసుకున్నానని మా నాన్న తో చెప్పించారని" ఆమె తెలిపారు....