సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కాశీనాథ్ గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జహీరాబాద్ మండల పరిధిలోని హుగ్గేల్లి శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీలో భద్రపరిచి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 8712661847 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు.