నల్లగొండ జిల్లా: రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విపులమైందని నల్లగొండ మండల సిపిఎం కార్యదర్శి సైదులు ఆదివారం విమర్శించారు. ఆదివారం దొడ్డి కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా కేంద్రం ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని సైదులు తెలిపారు .దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో ఎరువలను అందించాలని డిమాండ్ చేశారు.