వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆనందపురం సిఐ చింతా వాసు నాయుడు తెలిపారు. తొమ్మిది రోజులకు మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి కార్యక్రమాలు చేపట్ట రాదన్నారు. చవితి మండపాల్లో డీజే సౌండ్ వ్యవస్థ పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ డా. శంఖ బ్రత బాగ్చి ఆదేశాల మేరకు వేదిక ప్రోగ్రాంల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేవని తెలిపారు.