కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలదొంగలు రెచ్చిపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బస్టాండ్ వద్ద దుకాణాల ముందు పెట్టిన యాభై లీటర్ల పాలు, ఒక కేజీ పెరుగు డబ్బా దొంగిలించారు. బ్యాటరీ బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేశారు.