ములుగు జిల్లా జంపన్న వాగులో గల్లంతైయి జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మవాడకు చెందిన కానుకంటే మనీష్ అనే యువకుడు మృతి చెందాడు.వివరాలు చూస్తే జిల్లా కేంద్రానికి చెందిన మనీష్ అనే యువకుడు వినాయకుడి నిమజ్జనం అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లారు.జంపన్న వాగులో స్నానం చేసేందుకు దిగగా గల్లంతయ్యాడు.స్నేహితులు ఎంత వెతికినా లభ్యం కాకపోవడంతో పోలీసులకు NDRF బృందానికి సమాచారం అందించారు.గంటలు శ్రమించి ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికి తీశారు.మనీష్ మృతితో జనగామ జిల్లా కేంద్రంలోని కురుమవాడలో విషాదం నెలకొంది.