నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమంను నిర్వహించారు.స్థానిక బొమ్మల సత్రం నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు ర్యాలీనీ కొనసాగించారు.సిఎం డౌన్,డౌన్ అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.రైతులకి యూరియా కొరత లేకుండా అందించాలంటు డిమాండ్ చేశారు.అనంతరం ఆర్డీఓ విశ్వనాథ్ కు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవి,గంగుల నాని, ఎమ్మెల్సీ ఇషాక్ భాష,వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.