పల్నాడు జిల్లా గురజాల DSP జగదీష్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం దాచేపల్లి లో జరిగిన వసతి గృహ సంఘటన వీడియోను మరలా తప్పుడు సమాచారంతో కావాలని కొంత మంది వైరల్ చేస్తున్నరని తెలిపారు.వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు.గతంలో ఎప్పుడో జరిగిన ఘటనని మరల ఇప్పుడు వైరల్ చేయటం వెనక ఎవరైనా హస్తం ఉందా అని ఎంక్వయిరీ చేస్తామని అన్నారు.దయచేసి ఎవరూ కూడా ఇటువంటి వాటిని షేర్ చేయొద్దని డిఎస్పి జగదీష్ పేర్కొన్నారు.