హైదరాబాద్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఆశ వర్కర్లను చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఆశ వర్కర్లను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, తమకు ఫిక్స్డ్ వేతనం లేదని, ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామాలలో అన్ని సేవలు తామే చేస్తున్నామని అయినా మమ్మల్ని గుర్తించకపోవడం చాలా బాధ కరమని, ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని, చనిపోయిన ఆశ వర్కర్ల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషన్ చెల్లించాలని అరెస్టులతో ఉద్యమాలు ఆపలేన్నారు అని వారన్నారు.