Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 3, 2025
దారితప్పిన ఒక కొండచిలువ మంగళ వారం రాత్రి ఒక ఇంట్లోకి ప్రవే శించడంతో స్థానికులు భయ భ్రాంతులకు గురయ్యారు. చేజర్ల మండలం దొరువుపాడులో గంటా జనార్దన్ ఇంటి ఆవర ణలో అలికిడిగా ఉండటంతో పరిసరాలు పరిశీలించారు. ఒక చెట్టుకు భారీ కొండచిలువ చుట్టుకొని బసలు కొడుతూ కనిపించింది. ఆందోళనకు గురైన ఆయన గ్రామస్థుల సాయంతో దానిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. వెళ్లకపోవడంతో ఆదూరుపల్లి అటవీ ఠాణాకు సమాచారమిచ్చారు. ఎఫ్ బీవో పి. జనార్ధన్, సిబ్బంది, సలీం, రాహు ల్లు వచ్చి కొండ చిలువను పెద్ద గోతాములో బంధించి కండలేరు జలాశయం సమీపంలో అడవులకు తరలించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బుధవారం చక్కర్లు క