విశ్వశాంతి కోసం ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రహ్మకుమారిలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ రోటరీ క్లబ్ బాధ్యులు టీవీ సూర్యం రక్త దాతలు బ్రహ్మకుమారి సమాజం సోదర సోదరీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా శాంతి ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలను కొనియాడారు రక్తదానం చేద్దాం విలువైన ప్రాణాలను కాపాడుదాం అన్న నినాదంతో బ్రహ్మకుమారీలు విశ్వబంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు