రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పరిరక్షణ కొరకు మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం కళ్యాణదుర్గం మండలం వెస్ట్ కోడి పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు అడుగడుగునా జనాలు నీరాజనం పలుకుతున్నారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య ను ఆయా గ్రామాల్లో స్వచ్ఛందంగా గ్రామస్తులు ముందుకు వచ్చి పూలమాలలతో సత్కరిస్తున్నారు. పలుచోట్ల ప్రజలు మాట్లాడుతూ తలారి రంగయ్య పాదయాత్రను ప్రశంసించారు. ప్రజలు కూడా రంగయ్య వెంట నడిచారు.