బీజేపీ కార్యశాల "సేవ పక్వడ"భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు తల్లాడ మండల అధ్యక్షులు చల్లా నాగులు మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవ పక్వాడ అను నినాదంతో సేవే లక్ష్యంగా వివిధ సేవ కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చల్లా నాగులు, జిల్లా కౌన్సిల్ నెంబర్ గాదె కృష్ణారావు, ప్రధానకార్యదర్శులు రాయల్ రమేష్,తదితరులు పాల్గొన్నారు