ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రాష్ట్రంలో దుష్ట పాలనను అంతముందించేందుకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జతకట్టారని అన్నారు. మంగళవారం మీడియాతో మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గత ప్రభుత్వం పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. కృష్ణార్జున వల్లే రాష్ట్రాన్ని ఇరువురు పరిపాలిస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాతో అన్నారు.