నల్లగొండ జిల్లా చెరువుగట్టు గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై డిఎల్పిఓ విచారణ చేపట్టారు. గురువారం తెలిసిన వివరాల ప్రకారం ఫిబ్రవరిలో జరిగిన జాతరకు చేయని పనులకు బిల్లులు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని ,మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగటి మల్లికార్జున్రెడ్డి స్థానిక బిఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై అధికారులు విచారణ జరిపారు.