Araku Valley, Alluri Sitharama Raju | Aug 21, 2025
వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని గురువారం ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రజలకు సూచించారు. వినాయక మండపాలు ఏర్పాటు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని సూచించారు. భక్తులు, ఉత్సవ నిర్వాహకులు పండుగ ప్రశాంతంగా జరిగేలా అధికారులకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ (https://ganeshutsav.net) అనుమతులు పొందాలని ఎస్పీ సూచించారు.