ఓ వర్గం తమను కులం పేరుతో బెదిరించి ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నట్లు SRపురంలో వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. తాము ఇక్కడే 30 ఏళ్లుగా ఉన్నామని, అధికారులు తమకు ఇక్కడే పక్కా ఇంటిని మంజూరు చేశారన్నారు. అయితే శనివారం ఓ వర్గం వారు తమతోపాటు మరికొందరిపై దౌర్జన్యం చేశారని ఆవేదన చెందారు. తమను ఏమైనా చేస్తారని భయంగా ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు