కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలంలోని కరణం వారిపల్లె మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో అభివృద్ధిలో భాగంగా పనులలో మంగళవారం గ్రామస్తులు చేయూతనందించారు. పాఠశాలలో దారి, హెచ్చు తగ్గులు ఉండటం, వర్షం వస్తే నీళ్లు నిలబడటం, విద్యార్థులకు అసౌకర్యంగా ఉండటంతో కొంతమంది ధాతలు సహాయంతో, సిమెంట్, ఇసుక, కంకర ఇవ్వగా, ఈ రోజు గ్రామంలోని ప్రజలు వచ్చి కాంక్రెట్ పనిలో స్వచ్చందంగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలకు పాఠశాల ఉపాధ్యాయుడు గానుగ పెంట రమణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.