మొక్కలను సంరక్షించాలి: మెట్పల్లి కమిషనర్ మొక్కలు మనకు రక్షణ ఇస్తాయని వాటిని నాటి సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మెట్పల్లి పట్టణంలోని 12, 22వ వార్డులలో మినీ ప్రకృతి వనం ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను నాటారు. మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు తీసుకెళ్లి నాటాలని సూచించారు. కార్య క్రమంలో మున్సిపల్ సిబ్బంది రత్నాకర్, విష్ణు, ముజీబ్ తదితరులున్నారు. 01:29 pm 22nd Aug 2025