ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎర్రజర్ల గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడు మందిని అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం రాత్రి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మీడియా కి వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.2,03,670 నగదును ఆరు ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారందరూ తూర్పు నాయుడు పాలెం నికి చెందిన వ్యక్తులుగా ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని హెచ్చరించారు.