బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళలు కుమ్ములాట ఖమ్మం జిల్లా మధిర డిపో బస్సు భద్రాచలం నుండి హైదరాబాద్ వెళుతున్న తరుణంలో, కొత్తగూడెం సమీపంలోని ఇద్దరు మహిళలు బస్సు ఎక్కారు, వారు బస్సులో సీట్ల కోసం వాగ్వాదం చేసుకుంటూ ఒక్కసారిగా ఇద్దరు జుట్టును పట్టుకొని కొట్టుకోవడంతో బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా బెదిరిపోయారు. ఇదంతా చూస్తున్న బస్సు డ్రైవర్ కండక్టర్ ఏనుకూరు పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపి ఇద్దరు మహిళలను పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సంఘటన నెలకొంది. ఇదంతా చూసిన బస్సులో ప్రయాణికులు తమ మొబైల్ తోటి చిత్రీకరించి వాట్సప్ ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతోటి వైరల్ గా మారింది.