పీలేరు సీనియర్ సివిల్ కోర్ట్ నందు ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జియావుద్దీన్ తెలిపారు. శనివారం పీలేరు కోర్టు పరిధిలోని పోలీసు అధికారులతో జడ్జి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు మరియు చిత్తూరు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పీలేరు కోర్టు ఆవరణములో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.కాబట్టి పోలీస్ అధికారులు వారి వారి స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు కాంపౌండ్ క్రిమినల్ కేసులు తీసుకురావాలన్నారు