రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిర్మల్ జిల్లా భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ కు రేషన్ డీలర్లు విన్నవించారు. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గత ఆరు నెలలుగా కమీషన్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడు నెలల ప్రజలను రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. కమిషన్ డబ్బులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు