‘వినూత్న రీతిలో విద్యార్థులకు బోధిస్తున్నా' మారుతున్న కాలానుగుణంగా వినూత్న రీతిలో బోధన చేస్తున్నానని పాణ్యం జడ్పీ హైస్కూల్ సైన్స్ అధ్యాపకుడు వెంకటరమణ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 16 ఏళ్లుగా బోధన చేస్తున్నానని, ఎనిమిదో తరగతి నుంచి విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడమే కాకుండా, టెక్నాలజీ ఉపయోగించి వీడియోలను తయారు చేసి యూట్యూబ్లోనూ అప్లోడ్ చేస్తుంటానని తెలిపారు.