పంటల బీమా పునరుద్ధరించాలని, రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేసారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం కొత్తపేటలో జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అన్నదాత పోరు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు.