రాయచోటి జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో (డైట్) కొత్త విద్యార్థులకు సాదర స్వాగతంగా ఫ్రెషర్స్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. రెండవ సంవత్సరం విద్యార్థులు కొత్తవారిని పేరుపేరుగా పరిచయం చేసి స్వాగతం పలికారు.క్రమంగా జరిగిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేయగా, సాంస్కృతిక కార్యక్రమాలలో నాటకాలు, మిమిక్రీ, జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలతో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.జిల్లా విద్యాశాఖాధికారి, డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం మరియు వైస్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ఫ్రెషర్స్ డే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో, కళాశాల వా