నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. 66 వేల రూపాయల నగదు, 11/2 తులాల బంగారు 52 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు