వినాయక పండుగ, నిమజ్జనం వేడుకల్లో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర్ హెచ్చరించారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. వినాయక వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయదలచిన వారు పోలీసు, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.