లక్ష్మణచందా మండలం న్యూ కంజర్, పొట్టపల్లి (కే), పొట్టపల్లి (బి) గ్రామాలకు చెందిన 611 మంది రైతులకు సంబంధించిన పట్టా భూములు తప్పుగా అసైన్ లో నమోదయ్యాయి. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం హైదరాబాద్ లోని ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, పబ్లిక్ గ్రీవెన్స్ స్టేట్ చైర్మన్ వీజీ చిన్నరెడ్డిని కలిసి సమస్యను విన్నవించారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించిన ఆయన సీసీఎల్ఏ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో సారంగాపూర్ వ్యవసాయ మార