అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇటీవల రద్దైన పింఛన్లపై లబ్ధిదారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. అర్హత ఉన్న వారికి తప్పనిసరిగా పింఛన్ అందించాలనీ, ఫిర్యాదులు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో భీమవరం జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాత్రి 7:00 నుంచి 8:30 వరకు పాల్గొన్నారు.