గాజువాక డిపో సమీపంలో ఏర్పాటు చేసిన కోటిలింగాల వినాయకుడు ఆహుతులను అలరిస్తున్నాడు. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వినాయకుడు కోటిలింగాలతో తయారు చేయబడ్డాడని 15 అడుగుల నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలియజేశారు. గత సంవత్సరం బెల్లం వినాయకుడు రాష్ట్రవ్యాప్తంగా ఆకట్టుకుందని ఈసారి అంతకుమించి ఉండాలని ఉద్దేశంతో కోటీ లింగాలతో వినాయకుడిని తయారు చేశామని వెల్లడించారు.