ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వట్టివాగు ప్రాజెక్టులోకి 500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వట్టివాగు ప్రాజెక్టు అధికారులు మంగళవారం మధ్యాహ్నం 2 గేట్లను ఎత్తివేసి 1,080 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. వట్టి వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 239 మీటర్లు కాగా ప్రస్తుతం 238 మీటర్లకు చేరింది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.