నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర పుట్టికి 19720 రూపాయలు ఇచ్చి ధాన్యన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆందోళన చేశారు.