రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని బాలుర గురుకుల పాఠశాలతో పాటు కళాశాలను రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థులు నేలపై కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి హాస్టల్ను సందర్శించాలని సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.