శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శివాలయం వీధికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి తెలియజేశారు. ఉదయం చెత్త పడవేసి వస్తానని వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదని చుట్టుపక్కల కుటుంబ సభ్యుల వద్ద విచారించిన ఆచూకీ లభ్యము కాలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలియజేశారు.