ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పలు పరికరాలు, వస్తువులపై జిఎస్టి పెంచడం, తగ్గించడం జరిగిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ లోకి చేర్చాలని ఆయన కోరారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైల్వే సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేయాలని విజ్ఞప్తి చేశారు.