అడ్డతీగల నుంచి ఏలేశ్వరం కు వెళ్లే రహదారిని బాగు చేయాలంటూ శుక్రవారం ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న గిరిజన సంఘ నాయకులు ప్రజలతో రంపచోడవరం డిఎస్పి సాయి ప్రశాంత్ శుక్రవారం రాత్రి చర్చలు జరిపారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రహదారి పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు శుక్రవారం రాత్రి 9గంటలకు రంపచోడవరం DSP సాయి ప్రశాంత్ ధర్నా స్థలానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు,ఐటీడీఏ పీవో స్మరన్ రాజ్తో గిరిజన సంఘం నాయకుడు రామారావుతో ఫోన్లో మాట్లాడించారు. ఈ నెల 28లోపు రోడ్డు పనులు ప్రారంభిస్తామని పీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.