యాడికి మండల కేంద్రంలోని వెంకట్ ఫర్టిలైజర్స్ షాపులో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రూ .1 కోటి 10 లక్షల విలువైన పత్తి,మొక్కజొన్న విత్తనాలతో పాటు పురుగుల మందులను శనివారం రాత్రి సీజ్ చేశారు.మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా కు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా అనుమతులు లేకుండా విక్రయిస్తున్న 90 లక్షల విలువైన పత్తి,మొక్కజొన్న విత్తనాలు,రూ. 20 లక్షల విలువైన పురుగుల మందులను సీజ్ చేశారు. తదుపరి చర్యలు కొరకు మండల వ్యవసాయ అధికారి ఉన్నతాధికారులకు నివేదించారు.