సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితం నేటి తరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సమీకృత జిల్లాలెకటర్ కార్యాలయాల సముదాయం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ40 వ వర్థంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈకార్యక్రమంలో జేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసి నాగేష్ ఏవో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.