పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో మూడో వార్డులో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వైసీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వైసిపి నేతలు మాట్లాడుతూ కొత్తగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో మూడో వార్డులో 484 ఓట్లు తగ్గాయి అన్నారు. కమిషనర్ ఓటర్ జాబితా పై మరోసారి విచారణ చేయాలని కోరారు. అవసరమైతే తాము ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.