జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పాఠశాలలో క్రీడల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిఈటి, కోచ్ లతో సమావేశం నిర్వహించారు.