శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ పి ప్రసాదరావు పర్యవేక్షణలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, గంట్యాడ మండల వ్యవసాయాధికారి శ్యాం కుమార్, ఎస్ ఐ గణేష్, పౌరసరఫరాల శాఖ ఉప తహసిల్దార్ మూర్తి బృందాలుగా ఏర్పడి గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్లోని పలు ఎరువుల విక్రయదుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో యూరియా డిఏపి నిల్వలను, స్టాక్, సేల్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు.