శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి సమీపాన బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన రామాంజి వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ధర్మవరం నుండి వెల్దుర్తికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తుంపర్తి సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.