జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునుర్ గ్రామానికి చెందిన సంగ శరత్ కుమార్ అనే యువకుడు శుక్రవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ముత్తునూర్ గ్రామంలోని సంగ చంద్రయ్య కుమారుడైన శరత్ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి, కొద్ది రోజుల క్రితం వరికోత యంత్రాన్ని కొనుగోలు చేసి, దానిని నడిపిస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుండి ఛాతి నొప్పితో బాధపడుతూ అనేక సార్లు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకున్న నయం కాలేదు. దీంతో జీవితం పై విరక్తి చెంది శుక్రవారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.