ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో ఆత్మ సౌజన్యంతో డ్రోన్ పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని బుజ్జి భాయి మాట్లాడుతూ రైతులు సులభంగా డ్రోన్ తో పురుగుల మందుల పిచికారి చేసుకోవచ్చని తెలిపారు. మండలంలో పత్తి కంది మిరప పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నందున రైతులందరూ డ్రోన్ ను ఉపయోగించడం ద్వారా సమయము కూలీ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఏ మందులు ఏ విధంగా డ్రోన్ తో పిచికారి చేయాలో రైతులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.