ప్రకాశం జిల్లా మండలం రేగుమానిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట శిబిరం పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 14 మంది పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సుమారు లక్షా తొమ్మిది వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో దోర్నాల పెద్దారవీడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.