వీణవంక: మండలంలోని శ్రీరాముల పేట కొండపాక పోతిరెడ్డిపల్లి హిమ్మత్ నగర్ రెడ్డిపల్లి కోర్కల్ గ్రామాల రైతులకు పంటలకు సరిపడా యూరియా బస్తాల కోసం కిష్టంపేట సమీపంలోని కరీంనగర్- జమ్మికుంట రోడ్డుపై మంగళవారం సాయంత్రం మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించడంలో విఫలమైందన్నారు ఒకరికి ఒక యూరియా బస్తా మాత్రమే దొరుకుతుందని ఎకరానికి 5 యూరియా బస్తాలు అవసరం ఉంటే ఒక యూరియా బస్తా ఇస్తే ఏ విధంగా సరిపోతుందో చెప్పాలన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు రాజకీయ నాయకులు రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.