ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. వివిధ రూపాయలలో ఉన్న వినాయకుడిని మండపాలలో ఏర్పాటు చేసుకొని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మండపాలను ప్రత్యేకంగా రంగురంగుల విద్యుత్తు దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. ఉభయ దాతల సమక్షంలో ఆయా మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.